ఇసుక కొరతపై భారత కార్మిక సంఘాల ధర్నా

By Prashanth MFirst Published Nov 11, 2019, 4:17 PM IST
Highlights

ఇసుక కొరత తీర్చాలని, గత ఆరు నెలల కాలానికి భవన నిర్మాణ కార్మికులకు 10 వేల రూపాయల చొప్పున జీవన భృతి చెల్లించాలని, ఐ ఎఫ్ టి యు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం తరుపున జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. 

రాష్ట్రంలో ఇసుక కొరత తీర్చాలని, గత ఆరు నెలల కాలానికి భవన నిర్మాణ కార్మికులకు 10 వేల రూపాయల చొప్పున జీవన భృతి చెల్లించాలని, ఐ ఎఫ్ టి యు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం తరుపున జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. 

కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియాను అరికట్టాలని చేపట్టిన ఇసుక సరఫరా నిలిపివేత, ప్రత్యక్షంగా నిర్మాణరంగం, దానికి అనుబంధ కార్మికులపై పడిందని, ఈ కారణంగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నెలకు పదివేల రూపాయలు చొప్పున ఆరు నెలల కాలానికి కార్మికులకు జీవన భృతి చెల్లించాలని కోరారు.

Read also: sand: ఆన్‌లైన్ ఇసుక కొనడం ఎలా .. ప్రజలకు కలెక్టర్ సూచన

విజయవాడ : ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకునే విధానం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ ఆదివారం వ్యాఖ్యనించారు. దీనికి పరిష్కారంగా కాల్ సెంటర్‌ ఏర్పాటు చేశామని 0866 2474801, 803, 804 నంర్లకు ఫోన్‌ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఏపీఎండీసీ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక విక్రయిస్తుండగా ప్రస్తుతం 18200 టన్నుల ఇసుక నిల్వ ఉందని కలెక్టర్‌ వెల్లడించారు. 

ఏపీలో ఉల్లి అక్రమ నిల్వలు: ట్రేడర్లపై కేసులు

మొత్తంగా ఐదు రీచ్‌లు ఇప్పుడు నిర్వహణలో ఉన్నాయని, 38 మంది పట్టా ల్యాండ్‌ ఓనర్లు తవ్వకాలకు తమ సుముఖత వ్యక్తం చేశారని తెలపారు. మరోవైపు శనివారం జిల్లాలోని అన్ని రెవెన్యూ కేంద్రాలలో రైతు భరోసా కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. 

ఇదిలా ఉండగా, సోమవారం మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జన్మదినం సందర్భంగా ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్లో మైనార్టీల సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. 

జగన్ సొంత జిల్లాలో దారుణం

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఉర్దూలో పాండిత్యం ఉన్న నలుగురికి జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తామని తెలిపారు. అబుల్‌ కలాం ఆజాద్‌ పేరున జాతీయ పురస్కారం, అబ్దుల్‌ కలాం పేరుతో విద్యా పురస్కారం అందజేస్తామని వివరించారు. మంత్రులు, ఉన్నతాధాకారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో 300 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదివారం ప్రకటించారు.

click me!