అట్టహసంగా ప్రారంభమైన భీమిలి ఉత్సవాలు

By Rekulapally SaichandFirst Published Nov 10, 2019, 11:44 AM IST
Highlights

భీమిలి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తగరపువలసలో జ్యోతి ప్రజ్వలన చేసి బెలూన్లు ఎగురవేసి భీమిలి ఉత్సవాలను ప్రారంభించారు. 

చారిత్రక ప్రాధాన్యత కలిగిన భీమునిపట్నం లో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమిలి ఉత్సవ్ అట్టహాసంగా ప్రారంభమైంది. పట్నంలోని యోగా కేంద్రం నుండి మంత్రి ఎం శ్రీనివాసరావు జండా ఊపి కార్నివాల్ ను ప్రారంభించారు. లొట్టిపిట్ట లు గుర్రాలతో ప్రారంభమైన కార్నివాల్ పులి వేషాలు అమ్మవారి వేషాలు డప్పు డాన్సులు భజనలు కోలాటాలు కర్ర సాము మొదలైన వాటితో కార్న్వాల్ శోభాయమానంగా కన్నుల పండుగగా సాగింది.

వివిధ కళాశాలల్లో కళాశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు కార్న్వాల్ పొడవునా గీతాలు నినాదాలతో నడిచారు.భీమిలి ప్రధాన వేదిక వద్దకు చేరుకున్న తరువాత దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జిల్లాలోని ప్రధాన దేవాలయాల నమూనాలతో తయారు చేసిన  టెంపుల్ రెప్లికా ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

అనంతరం ప్రధాన వేదిక నుండి శాఖ దేవాదాయ శాఖ మంత్రి భీమిలి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .పర్యాటక అభివృద్ధికి ఉత్సవాలు దోహదపడతాయన్నారు.

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఇటువంటి ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. భీమిలి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వేదికపై నుండి ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం ప్రాంతంలో పర్యాటక రంగం మంచి భవిష్యత్తు తో ముందుకు దూసుకుపోతూ ఉందని, ముత్తంశెట్టి శ్రీనివాసరావు లాంటి వ్యక్తి మంత్రిగా లభించడం విశాఖ వాసులకు అదృష్టమన్నారు. భీమిలి ఎంతో చారిత్రిక ప్రాంతమని అంతే కాకుండా ఎంతో సుందరమైన ప్రాంతం అని ఆయన ప్రశంసించారు. 

అలాగే భీమిలి ఉత్సవాలు సందర్బంగా తగరపువలసలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ.ముత్తంశెట్టి.శ్రీనివాస రావు, అవంతి,కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ వార్ లో పాల్గొన్న వారిని సన్మనించారు జాతీయ ఎట్రెంన్ క్రీడా కారులుకు వీరందరికీ మంత్రి అవంతి శ్రీనివాస రావు చేతుల మీదుగా సన్మానం చేసారు. ఎడ్ల బండి పోటీలలో విజేతలకు విశాఖ జిల్లా ఇంచార్జి మినిస్టర్ కన్నా బాబు గారి చేతులమీదుగా మొమెంటో ఇవ్వడం జరిగింది. 
 


 

click me!