జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు వైసీపీ నేత, మంత్రి అవంతి శ్రీనివాస్. పవన్ చేసేది లాంగ్ మార్చ్ కాదని.. అది రాంగ్ మార్చ్ అని సెటైర్లు వేశారు. జనసేనాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో ఉన్నారని.. ఆయన పూర్తిగా ప్రతిపక్షనేత కంట్రోల్‌లోకి వెళ్లిపోయారని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు వైసీపీ నేత, మంత్రి అవంతి శ్రీనివాస్. పవన్ చేసేది లాంగ్ మార్చ్ కాదని.. అది రాంగ్ మార్చ్ అని సెటైర్లు వేశారు. జనసేనాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో ఉన్నారని.. ఆయన పూర్తిగా ప్రతిపక్షనేత కంట్రోల్‌లోకి వెళ్లిపోయారని తెలిపారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కలిసి తెర వెనుక రాజకీయాలు చేశారని.. ఇప్పుడు బహిరంగంగానే కలిసి రాజకీయాలు చేస్తున్నారని అవంతి దుయ్యబట్టారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని.. పవన్‌కు కేడర్ లేదని విమర్శించారు.
అందువల్ల చంద్రబాబు నాయుడు.. పవన్‌ని టీడీపీ అధ్యక్షుడిగా చేస్తే బాగుంటుందని సెటైర్లు వేశారు. తెలుగుదేం హయాంలో ఎమ్మెల్యే వనజాక్షిపై దాడి చేస్తే స్పందించని పవన్ కల్యాణ్ ఇప్పుడు రోడ్డెక్కడం ఏంటని శ్రీనివాస్ నిలదీశారు.
Also Read:ఈ ప్రాంతాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉంది
విశాఖపట్టణంలో ఆదివారం నాడు మధ్యాహ్పం ఉద్రిక్తత చోటు చేసుకొంది. మద్దెలపాలెం వైపుకు వెళ్లే దారిలో ఏయూ గేట్లను మూసివేశారు. పోలీసులు.దీంతో ఏయూ గేట్లను తోసుకొని జనసేన కార్యకర్తలు మద్దెలపాలెం వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, జనసేన కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకొంది.
పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వందలాది మంది జనసేన కార్యకర్తలు ఆదివారం నాడు విశాఖకు చేరుకొన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ నుండి మద్దెలపాలెం వైపుకు జనసేన కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మద్దెలపాలెం వైపుకు వెళ్లేందుకు ఆంధ్రా యూనివర్శిటీ వద్ద ఉన్న గేట్లను పోలీసులు మూసివేశారు.
భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు విశాఖపట్టణంలో లాంగ్ మార్చ్ నిర్వహించతలపెట్టారు. ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో జనసేనతో పాటు టీడీపీ కూడ పాల్గొంటుంది.
నేడే పవన్ లాంగ్ మార్చ్: పాల్గొనే నేతలు వీరే!
ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు భవన నిర్మాణకార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
దీంతో భవన నిర్మాణకార్మికుల పనులు కల్పించేలా ఇసుక కొరతను నివారించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు.
లాంగ్ మార్చ్ లో 13 జిల్లాల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. లాంగ్ మార్చ్ కి సంఘీభావం తెలిపిన రాజకీయ పక్షాలన్నింటికీ పవన్ కృతజ్ఞతలు తెలిపారు.