దేవినేని ఉమా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న స్దలం కూడా ఇరిగేషన్ శాఖదేనని చెప్పుకొచ్చారు. సంవత్సరానికి వేయి రూపాయలకు లీజుకు తీసుకున్న దేవినేని ఉమా మహేశ్వరరావు ఇంకా మీరు నీతి నిజాయితీ అని మాట్లాడతారా అంటూ మండిపడ్డారు.
అమరావతి: మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్శరరావుపై నిప్పులు చెరిగారు ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలవరం రివర్స్ టెండరింగ్ పై అనవసర రాద్ధాంతం చేస్తారా అంటూ మండిపడ్డారు.
రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రభుత్వానికి అవసరమైన వారికోసమేనంటూ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించడాన్ని తప్పుబట్టారు. పోలవరమే కాదు వెలిగొండకు కూడా రివర్స్ టెండరింగ్ కు వెళ్తామని స్పష్టం చేశారు.
టీడీపీ ఇచ్చిన ప్రతీ పని గురించి రివర్స్ టెండరింగ్ కు వెళ్తామని తెలిపారు. వేలకోట్ల రూపాయలు ఆదా దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎక్సెస్ ఇచ్చిన టెండర్ల ద్వారా దోపిడీ చేసిన మొత్తం పెదబాబు జేబులోకి వెళ్లిందా లేక చినబాబు జేబులోకి వెళ్లాయా..? లేక మరేవరి జేబులోకి వెళ్లాయో చెప్పాలని నిలదీశారు.
10 నుంచి 20 శాతం వరకు లెస్ కు టెండర్ వేస్తే వాటిని కట్టబెట్టడం అంటారా అంటూ దేవినేని ఉమాపై మండిపడ్డారు. దేవినేని ఉమా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న స్దలం కూడా ఇరిగేషన్ శాఖదేనని చెప్పుకొచ్చారు.
సంవత్సరానికి వేయి రూపాయలకు లీజుకు తీసుకున్న దేవినేని ఉమా మహేశ్వరరావు ఇంకా మీరు నీతి నిజాయితీ అని మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. మీకు సిగ్గుంటే ఆ స్దలాన్ని ఖాళీ చేసి మాట్లాడండి అంటూ తిట్టిపోశారు.
ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ పై జగన్ మోహన్ రెడ్డి దాడి చేస్తున్నారంటావా అంటూ నిలదీశారు. టీడీపీ ఇచ్చిన టెండర్లన్నీ ఎక్సెస్ అయితే తాము ఇచ్చిన టెండర్లన్నీ లెస్ అని ఇది ప్రజలందరికీ తెలుసునన్నారు.
ఇప్పటి వరకు రివర్స్ టెండరింగ్ వల్ల రూ.780కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందన్నారు. రివర్స్ టెండరింగ్ కు వెళ్లకపోతే ఇన్ని కోట్ల రూపాయలు చంద్రబాబు ఆయన వందిమాదిగల చేతుల్లోకి వెళ్లిపోయేదన్నారు.
ఇకపోతే రివర్స్ టెండరింగ్ లో నవయుగ కంపెనీ కూడా పాల్గొనవచ్చునని స్పష్టం చేశారు. బిడ్ లో పాల్గొనవచ్చు అని తామేం వద్దనడం లేదన్నారు. నవయుగ వాళ్లు నామినేషన్ లో అయితే ముందుకు వస్తారు కానీ బిడ్డింగ్ లో అయితే పాల్గొనరని విమర్శించారు.
వైయస్ జగన్ ప్రభుత్వం భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించబోతుందన్నారు. దేశం మెుత్తం ఏపీవైపే చూస్తుందని చెప్పుకొచ్చారు. వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు మిగులుస్తున్నారని భవిష్యత్ లో ఇదేరీతిలో అన్ని ప్రాజెక్టులలో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
రెండు సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు,ఎల్లోమీడియా విషప్రచారాలను నమ్మవద్దని మంత్రి హితవు పలికారు. టెండరింగ్ లో పారదర్శకతే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పుకొచ్చారు.
పోలవరం డ్యాం ఎత్తును తగ్గిస్తున్నారంటూ టీడీపీ చేస్తున్న రాద్ధాంతం అనవసరమేనని విమర్శించారు. డిజైన్ ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతుందని ఎత్తును తగ్గించే ప్రసక్తే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు డ్యాం ఎత్తు ఇది వరకు ఎంత నిర్ణయించారో అంత మేరకు డ్యాంను నిర్మిస్తామని స్పష్టం చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
ఈ వార్తలు కూడా చదవండి
టీడీపీని మూసేస్తారా..? లేక రాజకీయ సన్యాసం తీసుకుంటారా..?: చంద్రబాబూకు మంత్రి అనిల్ సవాల్
రివర్స్ టెండరింగ్ ఓ కుట్ర, సన్నిహితుల కోసమే ఆ డ్రామా: మాజీమంత్రి దేవినేని ఉమా
జగన్ ఖాతాలో మరో విజయం: రివర్స్ టెండరింగ్ లో రూ.686 కోట్లు ఆదా
జగన్ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్: తొలి ప్రయత్నంలో రూ.58 కోట్లు ఆదా
రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు: చంద్రబాబుకు మంత్రి అనిల్ కౌంటర్
గతంలో ఫెయిల్ అయిన మ్యాక్స్ ఇన్ ఫ్రాకు టెండరా...: దేవినేని ఉమా
తక్కువ ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం మంచిదే: రివర్స్ టెండరింగ్ సక్సెస్ పై జేసీ
అన్ని ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, బాబూ! చిల్లర రాజకీయాలు ఆపు: మంత్రి అనిల్
జగన్ ఏమైనా పతివ్రతా..? నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు: చంద్రబాబు ఫైర్
కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్ ల రికవరీ
పోలవరం రివర్స్ టెండర్లు: సెప్టెంబర్ 4 తర్వాతే ముందుకు
రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్
షెకావత్‌తో జగన్ భేటీ:పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి