
ముంబై వాంఖడే స్టేడియంలో సిక్సర్ల సునామీ అంటే ఎలా ఉంటుందో టీమిండియా చూపించింది. ఇంగ్లాండ్ బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ, భారత బ్యాటర్లు స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు. అసలు ఇది టీ20 మ్యాచ్‌లా లేక బ్యాటర్ల కోసం పెట్టిన నెట్ ప్రాక్టీస్‌లా అనిపించేలా.. ఏకంగా 19 సిక్సర్లతో విరుచుకుపడ్డారు. సెమీఫైనల్ ఒత్తిడిని పక్కన పెట్టి, 253 పరుగుల రికార్డు స్కోరుతో ఇంగ్లీష్ జట్టును భారత్ కోలుకోలేని దెబ్బకొట్టింది..