ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు

Bukka Sumabala   | Asianet News
Published : Jul 03, 2020, 10:22 AM IST

విజయవాడ, ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 

విజయవాడ, ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో శాకంబరీ ఉత్సవాలను ప్రారంభించారు. వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా అమ్మవారి దర్శనం లభించనుంది. రోజుకి ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్‌లైన్ ద్వారాwww.kanakadurgamma.org 
తీసుకునే వెసులుబాటును దేవస్థానం అధికారులు కల్పించారు.