Video: చంద్రబాబు అరెస్టు... అట్టుడుకుతున్న అమరావతి

Jan 8, 2020, 10:02 PM IST

అమరావతి: రాజధాని అమరావతి కోసం రైతులు చేపడతున్న ఉద్యమం ఉద్రిక్తంగా మారింది. జేఏసి పిలుపుమేరకు 13జిల్లాల యాత్రకు బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగి చివరకు టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు దారితీసింది. జేఎసి నాయకులకు మద్దతుగా నిలిచేందకు సంఘటనా స్ధలానికి చేరుకున్న చంద్రబాబును, మిగతా టిడిపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. తుళ్ళూరులో దీక్షా శిబిరం వద్ద టైర్లు తగలబెట్టి సీఎం డవున్ డవున్ అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు.