Jan 4, 2022, 3:33 PM IST
కరీంనగర్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కరోనా నిబంధనలను అతిక్రమిస్తూ జాగరణ దీక్ష చేపట్టారంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరీంనగర్ కోర్టు ఆయనకు 14రోజులు రిమాండ్ విధించగా ప్రస్తుతం జిల్లా జైలులో వున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జైలుకు చేరకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ములాకత్ లో భాగంగా బండి సంజయ్ ని కలిసారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పై నమోదైన కేసు పూర్వాపరాలపై కేంద్ర మంత్రి చర్చించినట్టు సమాచారం.