ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన కారు... ఇద్దరు జలసమాధి

Jan 5, 2022, 4:49 PM IST

జగిత్యాల: రెండురోజుల క్రితం జగిత్యాల జిల్లా మెట్ పల్లి సమీపంలో ఎస్సారెస్పి కాలువలోకి దూసుకెళ్ళిన కారును ఎట్టకేలకు పోలీసులు బయటకు తీసారు. దాదాపు మూడు గంటలపాటు గజ ఈతగాళ్లతో గాలించిన పోలీసులు కారుతోపాటు ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు  మెట్‌పల్లికి చెందిన పూదరి రేవంత్, గుండవేని ప్రసాద్‌ గా గుర్తించారు.