May 7, 2021, 5:28 PM IST
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అచ్చంపల్లి గేమనికి చెందిన అలేటి తిరుపతి రెడ్డి, అలేటి ఎల్లారెడ్డి అన్నదమ్ములు కరోనా బారిన పడ్డారు.వీరి వయస్సు డెబ్బయి కి పైన ఉండడం తో ఇంట్లోనే హోమ్ ఐసొలేషన్ లో ఉండి మందులు వాడుతున్నారు.దీంతో శుక్రవారం ఒకేసారి ఇద్దరి ఆరోగ్యం విషమించి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.దీంతో గ్రామ సర్పంచ్ పోతుల నరసయ్య గ్రామ పంచాయతీ సహాయం తో అంత్యక్రియలు పూర్తి చేశారు..