నూతన సచివాలయ అందాలు కనువిందు... త్రీడి లో సరికొత్త సొగసులు చూడండి..!

Mar 14, 2023, 1:12 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి సిద్దమయ్యింది. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ తుదిమెరుగులు దిద్దుకుంటున్న సచివాలయ భవనాన్ని పరిశీలించారు. సచివాలయం లోపల కల్పించిన సకల సౌకర్యాలు, అందంగా తీర్చిదిద్దిన అంతస్తులు, అద్భుతంగా నిర్మించిన సీఎం ఛాంబర్, విశాలమైన హాళ్లు, పెద్ద ఆడిటోరియం, హుస్సేన్ సాగర్ లెక్ వ్యూతో ఏర్పాటుచేసిన మీటింగ్ హాల్... బయట ఎత్తైన ప్రహారి, విశాలమైన పార్కింగ్, ఫౌంటెన్లు, గ్రీనరి, హెలిప్యాడ్... ఇలా సకల హంగులతో నిర్మించిన భవనాన్ని చూసి చూసి సీఎం సంతృప్తి వ్యక్తం చేసారు. దీంతో వచ్చే నెల (ఏప్రిల్) 30న నూతన సచివాలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ క్రమంలోనే నూతన సచివాలయ అందాలను త్రీడి యానిమేషన్ లో చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఓ వీడియోను విడుదల చేసింది. విశ్వనగరం హైదరాబాద్ కు మణిహారంలా నిలిచేలా అద్భుతంగా నిర్మించిన ఈ సచివాలయ భవనం త్రీడి యానిమేషన్ లో మరింత అందంగా కనిపిస్తోంది.