బిడ్డా కేసీఆర్... నీ బిడ్డ దొంగసారా దందా సంగతేంటి..?: బండి సంజయ్

Feb 19, 2023, 12:09 PM IST

వేములవాడ : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వేములవాడ ఆలయానికి  వచ్చే భక్తులంతా ఆ శివున్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరిచిపోరని అన్నారు. దుర్మార్గుడు, మూర్ఖుడైన సీఎం ఏ ఎండకు ఆ గొడుగు పడతాడన్నారు. 
వేములవాడకు ఒక్క పైసా ఇవ్వకపోగా ఇక్కడి డబ్బులు బయట పెడుతున్నాడని ఆరోపించారు. శివరాత్రి వేడుకలపై సమీక్ష చేయలేదని, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. పక్కా హిందూ ద్రోహి అయిన దేవుడికి కూడా శఠగోపం పెట్టే మూర్ఖుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేసారు. వేములవాడకు వచ్చే భక్తులు కేసీఆర్ ను పొట్టు పొట్టు తిడుతున్నారు సంజయ్ అన్నారు.  

ఇక డిల్లీ లిక్కర్ స్కాం లో నిందితుల బెయిల్ పిటిషన్ లో కేసీఆర్ కూతురు కవిత పేరు నాలుగుసార్లు వచ్చిందని సంజయ్ అన్నారు. శివుడి సన్నిధి నుండి అడుగుతున్నా... దొంగ సారా దందాలో నీ
బిడ్డ ప్రమేయంపై ఎందుకు స్పందిచవు అని ప్రశ్నించారు. ఆలయాల అభివృద్దికి డబ్బులివ్వవు కానీ నీ బిడ్డ వందల కోట్లు దోచుకునేందుకు సహకరిస్తావు... ఇందంతా ఆ శివుడు చూస్తున్నాడు బిడ్డా అంటూ కేసీఆర్ ను హెచ్చరించారు బండి సంజయ్.