అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేల నిరీక్షణ... ఏం జరుగుతుందో చూద్దామంటున్న రాజాసింగ్

Mar 15, 2022, 11:18 AM IST

హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన బిజెపి ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురయ్యింది. కోర్టు తీర్పు కాపీని తీసుకుని మొదట అసెంబ్లీ కార్యదర్శిని కలిసారు సస్పెన్షన్ కు గురయిన బిజెపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్. ఆ తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి తమను సభలోకి అనుమతించాలని కోరారు ముగ్గురు ఎమ్మెల్యే. కానీ అందుకు స్పీకర్ నిరాకరించడంతో బిజెపి ఎమ్మెల్యేలు చివరిరోజు కూడా సభలో అడుగుపెట్టలేకపోయారు.