బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కు ఎండ్ కార్డ్ పడింది. బిగ్ బాస్ విన్నర్ గా కన్నడ కుర్రాడు నిఖిల్ నిలిచాడు. ఫైనల్ వరకూ గౌతమ్, నిఖిల్ మధ్య హోరా హోరీ నడిచింది. ఒక దశలో గౌతమ్ విన్ అవుతాడు అనుకున్నారు అంతా. కాని ఫైనల్ గా నిఖిల్ ఈ టైటిల్ ను గెలిచాడు. బిగ్ బాస్ హౌస్ లో సౌమ్యుడిగా పేరుంది నిఖిల్. అన్ని ఆలోచించి చాలా తెలివిగా గేమ్ ఆడాడు.
కొన్ని సందర్భాల్లో తప్పించి ఎక్కడా రాంగ్ స్టెప్ వేయలేదు. సీజన్ 1 లో శివబాలాజీని మళ్ళీ గుర్తు చేశాడునిఖిల్. అందరిని కలపుకుని పోతూ.. తనను విమర్శించిన వారిని కూడా దగ్గరకు తీసి.. వారితో కూడా గుడ్ అనిపించుకున్నాడు. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ టైటిల్ గెలిచిన నిఖిల్ ఆ టైటిన్ నుఅలా చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ నాగార్జున పిలిచి పలకరించే వరకూ అతను అలా బిగ్ బాస్ ట్రోఫీని చూస్తూనే ఉన్నాడు. తాను చూస్తున్నది నిజమేనా.. లేదా అన్నంత షాక్ లో ఉండిపోయాడు నిఖిల్.
బిగ్ బాస్ ట్రోఫీ తో పాటు సీజన్ 8 విన్నర్ కు 55 లక్షల ఫ్రైజ్ మనీతో పాటు మారుతీ సుజికీ డిజైర్ కారు గిఫ్ట్ గా వస్తుంది. ఈ కారులో ఇంటికెళ్ళిపోబోతున్నాడు నిఖిల్ అంటూ నాగ్ ఆటపట్టించాడు. అటు రామ్ చరణ్ కూడా ప్రత్యేకంగా నిఖిల్ ను కంగ్రాట్స్ చేశాడు. అప్పుడు కూడా నిఖిల్ తన ట్రోఫీనే చూస్తు అదే షాక్ లో ఉన్నాడు.
ఇక నిఖిల్ విన్నర్ అని తెలియగానే అక్కడికి వచ్చిన అతని తల్లి, తమ్ముడు ఎమోషనల్ అయ్యాడు. కంటతడి పెట్టారు. ఇక ఈ ట్రోఫీ ఎవరికి అని కింగ్ అడిగితే ఇది తన అమ్మకు డెడికేట్ చేస్తాను అన్నారు నిఖిల్. తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు నిఖిల్. గెలిచిన ఆనందంలో ఎక్కువగా మాట్లాడలేకపోయాడు.
ఇక రన్నర్ గా నిలిచిన గౌతమ్ మాట్లాడుతూ.. తనను ఇక్కడి వరకూ తీసుకువచ్చిన ఆడియన్స్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను విన్నర్ అవ్వనందకు బాధపడద్దు అంటూ..తల్లీ తండ్రిని ఓదార్చే ప్రయత్నం చేశాడు గౌతమ్. అంతే కాదు నేను బాధపడటంలేదు..మీరు కూడా బాధపడవద్దు అన్నాడు నిఖిల్. చాలా మంచి మాటలు మాట్లాడారు. ఇక ఈ విషయంలో గౌతమ్ తల్లీ తండ్రి కూడా ఎమెషనల్ అయ్యారు.
ఇక మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఓ పదిరోజులు అవుడోర్ షూటింగ్ కు వెళ్తేనే ఉండలేము. కాని మీరు ఇన్ని రోజులు ఒక ఇంట్లో ఉన్నారంటే.. నిజంగా మీరంతా విన్నర్స్. చాలా గ్రేట్ అన్నారు చరణ్. ఆరోజుతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంప్లీట్ అయిపోయింది. టాప్ 5 లో విన్నర్ గా నిఖిల్, రన్నర్ గా గౌతమ్, 3వ ప్లేస్ లో నబిల్, నాలుగో ప్లేస్ లో ప్రేరణ, టాప్ 5 ప్లేస్ లో అవినాశ్ నిలిచారు.