కరీంనగర్‌ రీజియన్‌లో పెరుగుతున్న ఆర్టీసీ ఆదాయం

Nov 4, 2020, 1:35 PM IST

  కరోనా వైరస్‌ వ్యాప్తితో అతలాకుతలమైన ప్రజా రవాణా వ్యవస్థ కుదుటపడుతోంది. లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన బస్సులు మే 19 నుంచి రోడ్డెక్కాయి. అనుకున్నంత ఆదాయం రాలేదు. ప్రస్తుతం క్రమక్రమంగా గాడినపడుతోంది. కరోనా నుంచి ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కరీంనగర్‌ రీజియన్‌లో నిత్యం తిరిగే కిలోమీటర్లు పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతోంది. దీనికి తోడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసుల వ్యవహారం కొలిక్కి రావడంతో ఆదాయం మరింత పెరగనుంది.