May 28, 2021, 8:37 PM IST
కరీంనగర్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ, సరిహద్దు రాష్ట్రాల భక్తులతో విశేష పూజలందుకొంటున్న మహా మహిమాన్విత క్షేత్రం రేకుర్తిలోని స్వయంభు శ్రీ లక్షీనర్సింహ స్వామి ఆలయ విస్తరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కరీంనగర్ పట్టణాన్ని అనుకొని ఉండే ఈ ఆలయాన్ని మరింత సర్వాంగ సుందరంగా మరో యాదాద్రిలా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 2కోట్ల నిధులతో చేపట్టిన ఆలయ విస్తరణ పనులకు మంత్రి భూమి పూజ నిర్వహించారు.
ఈ ఆలయ విస్తరణ పనులకు నిధుల కొరత రాకుండా చూసుకోవాలని... త్వరితగతినపనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి అదేశించారు. ఈ పనులు పూర్తయితే లక్ష్మీనర్సింహ క్షేత్రం దేదీప్యమానంగా వెలిగిపోవడమే కాక భక్తుల అవస్థలు కూడా తీరతాయన్నరు. అటు ఆద్యాత్మికతను... ఇటు స్థానికులకు లబ్దిని చేకూర్చే ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమవడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.