ఈటెల రాజేందర్ సభలో.. దొంగల చేతివాటం...

22, Oct 2020, 3:55 PM

సాక్షాత్ రాష్ట్ర మంత్రివర్యుల సభలోనే దొంగలు తమ చేతి వాటం చూపించారు. నిన్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ టైంలో సందట్లో సడేమియాలాగా పిక్ పాకెట్ దొంగలు తమ పని తాము కానిచ్చారు. ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధుల జేబుల నుండి వేల రూపాయలు దొంగిలించారు. తరువాత జేబులు చూసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కొంత డబ్బు రికవరీ చేసి ఒకరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.