ఏంటీ ... కుమారి ఆంటీ ఆ పార్టీకి ప్రచారం చేస్తుందేంటి...!

Published : May 11, 2024, 08:24 AM ISTUpdated : May 11, 2024, 08:32 AM IST
ఏంటీ ... కుమారి ఆంటీ ఆ పార్టీకి ప్రచారం చేస్తుందేంటి...!

సారాంశం

సోషల్ మీడియా సెలబ్రిటీ కుమారీ ఆంటీ కొత్త అవతారం ఎత్తారు. ఇప్పటికే పలు టీవీ షోస్ లో కనిపించిన ఆమె ఇప్పుడు ఓ రాజకీయ పార్టీకి క్యాంపెయినర్ గా మారారు. 

గుడివాడ : కుమారి ఆంటీ... ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ఈమె సామాన్యురాలు కాదు సోషల్ మీడియా తయారుచేసిన సెలబ్రిటీ. హైదరాబాద్ లో రోడ్డుపక్కన చిన్న హోటల్ నిర్వాహించే కుమారీ ఆంటీ జీవితాన్ని ఒక్క వీడియో మార్చిపడేసింది. ''‘మీది మొత్తం 1000 అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా’ అంటూ కుమారీ ఆంటీ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇలా ఒక్క వీడియోతో సెలబ్రిటీ స్టేటస్ సంపాదించిన కుమారీ ఆంటీ తాజాగా కొత్త  అవతారం ఎత్తారు. ఎన్నికల వేళ ఓ రాజకీయ పార్టీ క్యాంపెయినర్ గా మారిపోయారు కుమారీ ఆంటీ. 

ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని ప్రధాన పార్టీలు రాజకీయ ప్రముఖులు, సినీ తారలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే టిడిపి కుమారీ ఆంటీని రంగంలోకి దింపింది. గుడివాడ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి  వల్లభనేని బాలశౌరికి మద్దతుగా కుమారి ఆంటీ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కూడా టిడిపి, జనసేన, బిజెపి కూటమికి గెలిపించాలని కుమారి ఆంటీ కోరారు.  

ఈ సందర్భంగా గత ఐదేళ్ల వైసిపి పాలనలో గుడివాడలో ఎలాంటి అభివృద్ది జరగలేదని కుమారి ఆంటీ అన్నారు. ఇక్కడి ప్రజలు ఉపాధిలేక ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు... అలాగే తాను కూడా  పొట్టచేతపట్టుకుని హైదరాబాద్ కు వెళ్లానని అన్నారు. తనలాగే ఎందరో పుట్టిపెరిగిన గుడివాడను వదిలి ఎక్కడో బ్రతుకుతున్నారని అన్నారు. పోలింగ్ రోజు ప్రతిఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని...  కూటమి అభ్యర్థులను గెలిపించాలని కుమారి ఆంటీ కోరారు. 

 

తన తండ్రి మృతికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని కుమారీ ఆంటి ఆవేదన వ్యక్తం చేసారు. సరైన వైద్యం అందకే తండ్రి చనిపోయాడని ... ఇలా భవిష్యత్ లో ఎవరికీ జరగకూడదని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే  సుపరిపాలన అందుతుందని... మంచి విద్య వైద్యం ప్రజలకు అందుతుందన్నారు. కాబట్టి టిడిపి, జనసేన, టిడిపి కూటమిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై వుందని కుమారి ఆంటీ అన్నారు.  

అయితే గతంలో కుమారీ ఆంటీ అధికార వైసిపికి అనుకూలంగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్లు ఇస్తున్నారని... అందులో భాగంగానే తనకూ ఓ ఇళ్లు వచ్చిందన్నారు. ఈ ఇళ్ళు తప్ప తనకేమీ ఆస్తులు లేవని కుమారీ ఆంటీ తెలిపారు. ఇలా గతంలో వైసిపికి అనుకూలంగా కామెంట్స్ చేసిన కుమారి ఆంటీ ఇప్పుడు టిడిపికి ప్రచారం చేస్తున్నారు. 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu