ఐపీఎల్ హిస్ట‌రీలో ఇదే తొలిసారి.. సెంచరీలు సాధించిన తొలి ఓపెనింగ్ జోడీగా సాయి సుదర్శన్, శుభ్‌మ‌న్ గిల్ రికార్డు

By Mahesh Rajamoni  |  First Published May 11, 2024, 12:22 AM IST

Sai Sudarshan - Shubman Gill : చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన ఐపీఎల్ 2024 59వ‌ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ ప్లేయ‌ర్లు శుభ్ మ‌న్ గిల్, సాయి సుద‌ర్శ‌న్ లు సూప‌ర్ ఇన్నింగ్స్ తో సెంచ‌రీలు సాధించారు. ఈ క్ర‌మంలోనే హిస్టారిక‌ల్ రికార్డును న‌మోదుచేశారు.
 


Shubman Gill - Sai Sudarshan : ఐపీఎల్ 2024 59వ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్, చెన్నై  సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్దాయి. చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌలింగ్ ను చీల్చిచెండాడుతూ గుజ‌రాత్ ఓపెన‌ర్లు శుభ్ మ‌న్ గిల్, సాయి సుద‌ర్శ‌న్ లు ఫోర్లు, సిక్స‌ర్లు బాదారు. ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో ప‌రుగుల సునామీ సృష్టించారు. ఈ క్ర‌మంలోనే గిల్, సాయి సుద‌ర్శ‌న్ లు సెంచ‌రీలు సాధించారు. దీంతో గుజ‌రాత్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 231 ప‌రుగులు చేసింది. 232 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ 35 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

అయితే, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ కు శుభ్ మ‌న్ గిల్, సాయి సుద‌ర్శ‌న్ లు భారీ స్కోర్ ను అందించారు. ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు 50 బంతుల్లో సెంచ‌రీలు సాధించారు. 103 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో సాయి సుద‌ర్శ‌న్ 5 ఫోర్లు, 7 సిక్స‌ర్లు బాదాడు. గిల్ 9 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 104 ప‌రుగుల ఇన్నింగ్స్ తో మెరిశాడు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో గుజ‌రాత్ 231-3 ప‌రుగులు సాధించింది. అయితే, ఐపీఎల్ చ‌రిత్ర‌లో గిల్, సాయి సుద‌ర్శ‌న్ లు స‌రికొత్త రికార్డు సృష్టించారు. ఒకే మ్యాచ్ లో వ్యక్తిగత సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా వీరు ఘ‌న‌త సాధించారు.

Latest Videos

ఐపీఎల్ హిస్టరీలో అత్య‌ధిక సెంచ‌రీలు కొట్టిన టాప్-5 ప్లేయ‌ర్లు వీరే..

ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు ఇద్దరూ ఒకేసారి సెంచరీలు చేయడం ఐపీఎల్ హిస్టరీలో ఇదే తొలిసారి. బెయిర్ స్టో ఔటైన తర్వాత వార్నర్ సెంచరీ సాధించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అంత‌కుముందు ఈ ఘ‌న‌త సాధించింది. జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ లు ఈ మైలురాయిని అందుకున్న తొలి ఓపెనింగ్ జోడీగా నిలిచారు. వారి త‌ర్వాత ఇప్పుడు గిల్, సాయిలు ఒకే సారి సెంచ‌రీలు సాధించి చ‌రిత్ర సృష్టించారు. 2022లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్లో ఎల్ఎస్జీ ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ భాగస్వామ్య రికార్డును సమం చేసింది గిల్-సాయిసుద‌ర్శ‌న్ జోడీ.

 

1️⃣st century for⚡ai ⚡udharsan... and we couldn't have been happier 💯🤩 | | | pic.twitter.com/jfwywc8Dt1

— Gujarat Titans (@gujarat_titans)

 

Time to 𝗯𝗼𝘄 𝗱𝗼𝘄𝗻 to Captain Gill... 💯⚡

4️⃣th 💯⚡
1️⃣st 💯⚡ | | pic.twitter.com/myFhIukh8b

— Gujarat Titans (@gujarat_titans)

 

This part of our lives is called... 🥺

Complete in the comments, | | | pic.twitter.com/p1h1S1Tidf

— Gujarat Titans (@gujarat_titans)

 

GT VS CSK: గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓట‌మి.. సీఎస్కేకు పెరిగిన‌ ప్లేఆఫ్ క‌ష్టాలు 

click me!