Latest Videos

ధోని క్రేజ్ అట్లుంట‌ది మ‌రి.. భద్రతను ఉల్లంఘించి గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన అభిమాని, వీడియో

By Mahesh RajamoniFirst Published May 11, 2024, 8:48 AM IST
Highlights

MS Dhoni fan : ఐపీఎల్ 2024 59వ మ్యాచ్ సంద‌ర్భంగా చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఒక అభిమాని ఒక్క‌సారిగా గ్రౌండ్ లోకి దూసుకువ‌చ్చాడు. త‌న క్రికెట్ హీరోను క‌లిసి ఆనందంలో ధోని కాళ్ల‌పై ప‌డ్డాడు. ఈ దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.   
 

MS Dhoni fan viral video : ఐపీఎల్ 2024 59వ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో చెన్నై పై గుజ‌రాత్ సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. అయితే, మ్యాచ్ ఓట‌మితో సంబంధం లేకుండా స్టేడియంలో ఎంఎస్ ధోని పేరు మారుమోగింది. ధోని బ్యాటింగ్ కు వ‌స్తున్న స‌మ‌యంలో ధోని ధోని అంటూ గ్రౌండ్ ను హోరెత్తించారు అభిమానులు. ఈ మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఒక అభిమాని త‌న హీరును క‌లుసుకోవ‌డానికి సెక్యూరిటీని దాటుకుని గ్రౌండ్ లోకి ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చాడు. దీనిని సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

భార‌త క్రికెట్ మాజీ కెప్టెన్, మూడు ఫార్మాట్ ల‌లో ఇండియా ఛాంపియ‌న్ గా నిలిపిన ఎంఎస్ ధోని అంత‌ర్జాతీయ క్రికెట్ కు ఇప్ప‌టికే రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ స‌హా ప‌లు లీగ్ ల‌లో ఆడుతున్నాడు. అయితే, రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ధోని క్రేజ్ మాత్రం ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఐపీఎల్ మ్యాచ్ ల‌లో ధోని వ‌స్తున్నాడంటే చాలా ధోని ధోని అంటూ స్టేడియం హోరెత్తుతుంది. ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించింది. గుజ‌రాత్ టీమ్ హోం గ్రౌండ్ అహ్మ‌దాబాద్ స్టేడియంలో.. ధోని అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. అతని ప్రజాదరణకు హద్దులు లేవు, ప్రేక్షకులు అతనికి దగ్గర కావడానికి తరచుగా క్రికెట్ మైదానంలోకి ప్రవేశించిన సంఘటనలు దీనికి నిదర్శనం.

కోహ్లీ, రోహిత్ వ‌ల్లకాలేదు.. స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన సాయి సుద‌ర్శ‌న్

అమితమైన ఆరాధనతో.. ప్రేమాభిమానాలు సంపాందించుకున్న ధోనిని క‌ల‌వ‌డానికి ఇప్ప‌టికే ప‌లుమార్లు అత‌ని అభిమానులు గ్రౌండ్ లోకి దూసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ చివ‌రి ఓవ‌ర్ లో ధోని బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో సెక్యూరిటీని దాటుకుని ఒక అభిమాని గ్రౌండ్ లోకి ప‌రుగెత్తాడు. ధోని వ‌ద్ద‌కు వ‌చ్చి అత‌ని కాళ్ల‌పై ప‌డ్డాడు. ధోని వెంట‌నే అత‌న్ని పైకి లేపి అత‌ని భూజాల‌పై చేతులు వేసి కొంత దూరం ముందుకు న‌డిచాడు. వెంట‌నే అక్క‌డున్న సెక్యూరిటీ అత‌న్ని గ్రౌండ్ నుంచి తీసుకువెళ్లారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు వైర‌ల్ గా మారాయి. ధోని అభిమానులు అంటే అట్లుంట‌ది మ‌రి అనే కామెంట్స్ వ‌స్తున్నాయి.

 

His heartfelt connection with that fan and his unwavering defense against the guards.

He genuinely loves us(fans). 🥹💛 pic.twitter.com/Au4h0lkDQl

— 🜲 (@balltamperrer)

 

A fan breached security to meet Dhoni and then Dhoni gave him a hug ❤️

- Most humble celebrity in India . pic.twitter.com/sDLNG1iG0s

— MAHIYANK™ (@Mahiyank_78)

 

ఇక ఈ మ్యాచ్ లో ధోనీ 11 బంతుల్లో 26 పరుగులు చేయగా, రషీద్ ఖాన్ బౌలింగ్ లో బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టి అహ్మదాబాద్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించగా, బి సాయి సుదర్శన్ తన తొలి ఐపీఎల్ సెంచరీని నమోదు చేయడంతో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. సుదర్శన్ (51 బంతుల్లో 103 పరుగులు), కెప్టెన్ గిల్ (55 బంతుల్లో 104 పరుగులు)తో జతకట్టడంతో ఇద్దరు ఓపెనర్లు విధ్వంసకర సెంచరీలు సాధించి  గుజ‌రాత్ కు 231/3 భారీ స్కోర్ అందించారు. ఛేద‌న‌లో డారిల్ మిచెల్ (63), మొయిన్ అలీ (56) అర్ధశతకాలు సాధించినప్పటికీ ఆతిథ్య జట్టు బౌలర్లు రాణించ‌డంతో చెన్నై సూప‌ర్ కింగ్స్ 20 ఓవ‌ర్ల‌లో 196/8 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 

 

Maahi maar raha hai, phir se 🫶 pic.twitter.com/KmSnbZZsHh

— JioCinema (@JioCinema)

 

ఐపీఎల్ హిస్ట‌రీలో ఇదే తొలిసారి.. సెంచరీలు సాధించిన తొలి ఓపెనింగ్ జోడీగా సాయి సుదర్శన్, శుభ్‌మ‌న్ గిల్ రికార్డు

 

click me!