Dec 22, 2020, 11:36 AM IST
నిజామాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ పర్యటనలో వున్న ఆమె రోడ్డు ప్రమాదానికి గురయిన ఓ మహిళకు సాయం అందించారు. నగరంలోని కంఠేశ్వర్ మీదుగా కవిత వెళుతుండగా ఓ మహిళ ప్రమాదానికి గురయిన విషయాన్ని గుర్తించారు. దీంతో వెంటనే తన వాహనం దిగి బాధితురాలికి సాయం చేశారు. మహిళను ఆస్పత్రికి తరలించి మంచి చికిత్స అందేలా చూశారు. ఇలా తనమానాన తాను వెళ్లకుండా ప్రమాదానికి గురయిన మహిళకు సాయం అందించడానికి ముందుకువచ్చిన కవితపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.