Jul 23, 2023, 2:41 PM IST
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఎమ్మెల్సీ కవిత చిన్నకొడుకు ఆర్య దేవనపల్లి పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. తల్లిదండ్రులు కవిత, అనిల్ తో కలిసి కొడుకులు ఆదిత్య, ఆర్య పెద్దమ్మగుడికి చేరుకున్నారు. కవిత కుటుంబాన్ని ఆలయ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, అధికారులు, అర్చుకులు స్వాగతం పలికారు. ఆర్య పేరిట అమ్మవారికి పూజలు నిర్వహించిన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం అందించారు.