May 26, 2022, 12:50 PM IST
కరీంనగర్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలోని మసీదులను తవ్విచూద్దాం... శవాలు వస్తే అది మీది, శివాలు (శివలింగం) వస్తే అది మాది... అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ పాలకుడయ్యాక రాష్ట్ర అభివృద్ది పథంలో దూసుకుపొతోందని... ఇలాంటి సమయంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టడం తగదని మంత్రి గంగుల హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు కూడా విధ్వంసాన్ని కోరుకోవడం లేదని... అభివృద్దినే కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మతకలహాలు లేవు... లా ఆండ్ ఆర్డర్ బాగుందన్నారు. ఇలాంటి తెలంగాణలో మసీదుల్లో గడ్డపార పెట్టి తవ్వేదేదో కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ది రూపంలో తవ్వు అంటూ సంజయ్ కు మంత్రి గంగుల కౌంటరిచ్చారు.