Nov 5, 2021, 2:38 PM IST
హైదరాబాద్: అంబర్ పేట్ గోల్నాక డివిజన్లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వేస్ట్ పేపర్లను నిల్వవుంచే గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎంతో కష్టపడి మంటలను అదుపుచేసారు. అయితే అప్పటికే గోదాంలోని సామాగ్రితో సహా చిత్తుకాగితాలన్ని కాలిబూడిదయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన గోదాంను గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... గతంలో కూడా ఇదే గోదాంలో అగ్నిప్రమాదం సంభవించినట్లు గుర్తుచేసారు. అయినా కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరోసారి ఇక్కడ ఇలాంటి ఘటనలు జరిగిందన్నారు. ఇళ్ల మధ్యలో ఇలాంటి గోదాములు ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని... తక్షణమే ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి గోదాములను సీజ్ చేస్తామని కార్పోరేటర్ తెలిపారు.