Dec 6, 2019, 10:00 AM IST
దిశా కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. మొత్తం నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్పల్లి వద్ద ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో పోలీసుల కళ్లుగప్పి పారిపోతుంగా వారిపై కాల్పులు జరిపారు. దిశాను చంపేసిన తగులబెట్టిన చోటే నలుగురు రేపిస్టులను చంపేశారు. విషయం తెలిసిన నిందితుడు ఆరిఫ్ తల్లి శోకసముద్రంలో మునిగిపోయింది. నా కొడుకును చంపిండ్రమో అంటూ ఆమె ఏడుపు అందర్నీ కదిలించింది.