May 26, 2020, 5:04 PM IST
మంథని పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్రూమ్ లో ఈ తెల్లవారుజామున వన్యప్రాణుల వేటగాడు శీలం రంగయ్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామ శివారులో రెండు రోజులక్రితం వన్యప్రాణుల వేట కోసం వెళ్లిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో శీలం రంగయ్య కూడా ఉన్నాడు. అప్పటినుండి వీరు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. దీంతో మనస్తాపం చెందిన రంగయ్య బాత్రూమ్ కు వెలుతున్నానని చెప్పి వెళ్లి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు రంగయ్య ను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందాడని ధృవీకరించిన వైద్యులు. సంఘటన స్థలానికి జిల్లా యంత్రాంగం తో పాటు రామగుండం సిపి సత్యనారాయణ చేరుకొని పరిశీలించారు.