Nov 9, 2019, 2:52 PM IST
చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు మధ్యాహ్నం ఆర్టీసీ కార్మికులు ఒక్కసారే ట్యాంక్‌బండ్ పైకి వచ్చారు. వందలాది మంది ఆర్టీసీ కార్మికులు వచ్చి బారికేడ్లను, ముళ్ల కంచెను దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులతో ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట చోటు చేసుకొంది.