తెలంగాణలో భానుడి భగభగ... ఎండవేడికి కారులో మంటలు

Apr 20, 2021, 5:15 PM IST

కరీంనగర్: రోహిణి కార్తే ఎండలకు రోకల్లు కూడా బద్దలవుతుంటాయని పెద్దలు అంటుంటారు. అయితే అంతకంటే ముందే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు నడి రోడ్డుపై ఓ కారులో మంటలు చెలరేగిన సంఘటన చొప్పదండి పరిధిలో చోటుచేసుకుంది. చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామ శివారులో ఎండ తీవ్రతకు కారులో మంటలు చెలరేగి అగ్గికి ఆహుతయ్యింది. కారులో మంటలు చెలరేగగానే కారులోని వ్యక్తి అప్రమత్తమవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.