Jan 28, 2022, 10:35 AM IST
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల బిజెపి అధ్యక్షుడు పరశురాం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కల్లెడ వద్ద రోడ్డు ప్రమాదం జరగ్గా తీవ్రంగా గాయపడ్డ పరశురాంను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మండలాధ్యక్షుడి మరణవార్త తెలియడంతో స్వయంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జగిత్యాల హాస్పిటల్ కు వెళ్లారు. పరశురాం మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పరశురాం కుటుంబసభ్యులు సంజయ్ ని పట్టుకుని బోరున విలపించారు.