రవీంద్రభారతిలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు (వీడియో)

Sep 29, 2019, 5:21 PM IST

తెలంగాణ చరిత్రను, వారసత్వాన్ని ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలు రవీంద్ర భారతిలో ప్రారంభమయ్యాయి. తీరొక్క పూల పండుగ బతుకమ్మ, బతుకును కోరే పండుగ బతుకమ్మ, ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు జరిగేది బతుకమ్మ.

ఈ తొమ్మిది రోజులు పల్లె, పట్నం అని తేడా లేకుండా రాష్ట్రం మొత్తం పూలవనంలా మారిపోతుంది. గుమ్మడి, గునుగు, తంగేడు, రుద్రాక్ష, బీర, బంతి, కట్లపూల సొగసు రంగరించుకునే ముచ్చటైన పూబోణి బతుకమ్మ. బతుకమ్మ అంటే బతికించే అమ్మ అని అర్థం. బతుకమ్మ పాటలూ ప్రత్యేకమే. బతుకమ్మ పాటల్లో రోజువారీ జీవితాలు ప్రతిఫలిస్తాయి.