Aug 21, 2020, 2:06 PM IST
భాద్రపద శుద్ధ చవితినాడు నియమనిష్టలతో వినాయకుడిని ఆచరించే వ్రతమే వినాయకచవితిగా ప్రసిద్ధికెక్కింది. ఈ వ్రతాన్ని స్వయంగా పరమశివుడే కుమారస్వామికి వివరించాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ వ్రతవిధానాన్నే వనవాసంలో ఉన్న ధర్మరాజు కోరిక మేరకు సూతమహాముని వివరించాడని చెబుతారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ వినాయకచవితి ఈ యేడు దివ్యయోగాలను మోసుకురాబోతోంది.