Jun 30, 2020, 2:52 PM IST
మాస్క్ వేసుకోమన్నందుకు మహిళా సీనియర్ అసిస్టెంట్ పై దాడి చేసిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు పర్యాటక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు భాస్కర్ రావును అరెస్ట్ చేశారు. కొంతకాలంగా భాస్కర్ రావు కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగినులపై వేధింపులకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. భాస్కర్ రావును త్వరలో కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెబుతున్నారు.
చూడండి: లేడీ అసిస్టెంట్ జుట్టు పట్టి ఎంత దారుణంగా కొట్టాడో...