KCR Delhi Tour: రైతు సంఘాల నాయకుడు రాకేష్ టికాయత్ తో కేసీఆర్ భేటీ

Mar 3, 2022, 4:51 PM IST

డిల్లీ: ప్రస్తుతం దేశ రాజధాని న్యూడిల్లీ పర్యటనలో వున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా రైతు సంఘాల నాయకుడు రాకేష్ టికాయత్ తో భేటీ అయ్యారు. డిల్లీలోని కేసీఆర్ నివాసంలో బిజెపి రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్య స్వామితో పాటు రాకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం ఇంటికి వచ్చిన రాకేష్ కు ఆయన కూతురు కల్వకుంట్ల కవిత సాదర స్వాగతం పలికారు.  మొన్నటి వరకు ఎన్డీయేతర ముఖ్యమంత్రులను కలిసిన సీఎం కేసీఆర్ .. ఇప్పుడు బీజేపీ సీనియర్ నేతలు, రైతు సంఘాల నాయకులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.