vuukle one pixel image

పండరీపూర్ పాండురంగ స్వామి సన్నిధిలో సీఎం కేసీఆర్... ప్రత్యేక పూజలు

Jun 27, 2023, 12:26 PM IST

షోలాపూర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని ప్రముఖ హిందూదేవాలయం పండరీపూర్ ను సందర్శించారు. నిన్ననే(సోమవారం) భారీ వాహనశ్రేణితో రోడ్డుమార్గంలో షోలాపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి ఇవాళ పండరీపూర్ చేరుకున్నారు.బిఆర్ఎస్ నాయకులతో కలిసి కేసీఆర్ రుక్మిణి సమేత పాండురంగ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు కేసీఆర్ బృందానికి సాదరస్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు. మధ్యాహ్నం తుల్జాపూర్ భవాని మాతను కేసీఆర్ దర్శించుకోనున్నారు.