బాలయ్య గురించి బయట చెప్పడమే కానీ, ఎప్పుడూ దగ్గరగా చూసింది లేదు, కానీ ఈ సినిమా చేసేటప్పుడు చూశాను, ఆయనంటే ఏంటో అర్థమయ్యింది. ఎంతగా ప్రేమిస్తారో తెలిసింది. ఎంత స్వచ్ఛంగా ఉంటారో తెలిసిందన్నారు బాబీ. ఒకప్పుడు నాకు బాలకృష్ణ, ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి కొడుకుగా తెలుసు, కోట్ల మంది అభిమానులకు దేవుడని తెలుసు, మాట ఇస్తే నిలబడతారని తెలుసు.
కానీ దగ్గర నుంచి చూసాక బాలకృష్ణ గారిది ఎంత గొప్ప మనసో తెలిసింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాలకృష్ణ గారి అభిమానులు ఫోన్లు, మెసేజ్ లు చేసి మంచి సినిమా చేశారని మెచ్చుకున్నారని తెలిపారు. భవిష్యత్ లో బాలకృష్ణ గారితో `డాకు మహారాజ్` ని మించిన గొప్ప చిత్రం చేస్తానని మాట ఇస్తున్నా అని వెల్లడించారు దర్శకుడు బాబీ.