చాలా కుంభమేళాలు చూసా... ఇలాంటిదెప్పుడూ చూడలేదు : చిదానంద సరస్వతి

Published : Jan 22, 2025, 11:19 PM IST
చాలా కుంభమేళాలు చూసా... ఇలాంటిదెప్పుడూ చూడలేదు : చిదానంద సరస్వతి

సారాంశం

ప్రయాగరాజ్ మహాకుంభ్ 2025లో భక్తుల సందోహం ఉప్పొంగింది. పరమార్థ నికేతన్ అధ్యక్షులు చిదానంద సరస్వతి దీన్ని అద్భుతంగా అభివర్ణించి, సీఎం యోగిని ప్రశంసించారు. 

మహాకుంభ్ నగర్ : ప్రయాగరాజ్ కుంభమేళాలో సన్యాసులు, మహాత్ములు, కోట్లాది భక్తుల సందడి మామూలుగా లేదు. తాజాగా పరమార్థ నికేతన్, రుషికేశ్ అధ్యక్షులు, ఆధ్యాత్మిక గురువు చిదానంద సరస్వతి కుంభమేళాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకుంభ్ భారతీయతకు గొప్ప పండుగ, సనాతన ఆస్థకు ఇంతకంటే పెద్ద ఉత్సవం లేదన్నారు. మహాకుంభ్ అందరిదీ, ప్రజలు ఉత్సాహంగా, ఉప్పొంగిపోతూ మహాకుంభ్‌లో పాల్గొంటున్నారు... సంగమం తీరాలు భక్తులతో నిండిపోయాయన్నారు. ఇలాంటి దృశ్యం ప్రపంచంలో ఎక్కడా కనిపించదని. ఇది సనాతన ధర్మం గొప్పతనమని అన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సనాతన ధర్మాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని ఆయన ప్రశంసించారు.

పరమార్థ నికేతన్ అధ్యక్షులు చిదానంద సరస్వతి 1971 నుంచి కుంభమేళాలో పాల్గొంటున్నారట. కానీ ఈసారి మాదిరిగా ఇంతకు ముందు ఎన్నడూ ఏర్పాట్లు లేవని ఆయన అన్నారు. ఈ మహా కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న సీఎం యోగిని ఆయన అభినందించారు. సీఎం అవిశ్రాంత కృషి వల్లే ఇంత గొప్పగా మహాకుంభ్ జరుగుతోందని... ఈ అద్భుత కార్యక్రమాన్ని చూసి అందరూ ఆనందిస్తున్నారు, ఉత్సాహంగా ఉన్నారన్నారు. 
 
దేశ నలుమూలల నుంచే కాదు ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి వచ్చిన భక్తులు, పర్యాటకులు మహాకుంభ్ వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని చూసి ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నారని అన్నారు. మహాకుంభ్ ద్వారా సనాతన ఐక్యతా సందేశం ప్రపంచానికి వెళ్తోందన్నారు చిదానంద సరస్వతి.

 

 
 

PREV
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood