నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా- PFI నిధులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరోపణల నేపథ్యంలో సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) జాతీయ అధ్యక్షుడు ఎం.కె. ఫైజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. కేరళలోని పలక్కాడ్‌కు చెందిన 55 ఏళ్ల ఫైజీని మార్చి 3న అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. గత నెల 28న ఇడి అధికారులు బెంగళూరులోని ఫైజీ నివాసంలో సోదాలు నిర్వహించిన కొన్ని రోజుల తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు.