లంగ్ కాన్సర్ ను ముందుగా గుర్తించడం ఇక సాధ్యమే...కాన్సర్ రోగుల ప్రాణాలు కాపాడటం లో ఇది ఒక మేలి మలుపు...

Sep 29, 2023, 5:35 PM IST

మానవాళికి రోజు రోజుకి క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది...జీవనశైలి. ఆహారపు అలవాట్లు ఇలా కారణాలు ఏమైతేనేమి ఇప్పుడు మనం ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య కాన్సర్...అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది బారిన పడే వాటిలో లంగ్ కాన్సర్ రెండవది...అయితే ముందుగా గుర్తించినట్లయితే గనుక 60 శాతం మంది బ్రతికే అవకాశం ఉంది...అయితే ముందుగా గుర్తించలేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు...అయితే ఇప్పుడు IISC బెంగళూరు కు చెందిన భారతీయ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్. అశోక్ M. రాయచూర్ మరియు డాక్టర్ జయ ప్రకాష్‌ లు ముందుగానే ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స కోసం వారి మార్గదర్శక పద్ధతిని ఆవిష్కరించారు..ఈ సందర్భంగా వారు ఏసియా నెట్ న్యూస్ తో ప్రత్యేకం గా సంభాషించారు.. వారి రీసెర్చ్ గురించి వారి చికిత్సా విధానాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం...