Oct 1, 2024, 11:45 PM IST
సూపర్‌స్టార్ రజనీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరుగుతుంది. సోమవారం రాత్రి ఆయనకు తీవ్ర కడుపు నొప్పి వచ్చిందట. వెంటనే కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. పలు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ శస్త్రచికిత్స చేశారట. పొత్తి కడుపు క్రింద సర్జరీ చేసిన డాక్టర్స్ స్టెంట్ అమర్చినట్లు సమాచారం. ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారట. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.