Galam Venkata Rao | Published: Mar 22, 2025, 4:00 PM IST
కేంద్ర ప్రభుత్వ డీ లిమిటేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో నిర్వహించిన డీ లిమిటేషన్ JAC భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. డీ లిమిటేషన్ పై ఇప్పడు ప్రశ్నించకపోతే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం పెద్దన్నలా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని కోరారు.