Jul 9, 2020, 11:09 AM IST
యూపీలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేను ఉజ్జయిని మహాకాళి ఆలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న కిరాతక రౌడీని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారని యూపీ పోలీస్ వర్గాలు తెలిపాయి. జూలై 3న కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిది. రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసులు చనిపోయారు. వీరిలో డీఎస్పీతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే, అతడి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.