Galam Venkata Rao | Published: Apr 2, 2025, 8:00 PM IST
భూకంపం ఎలా వస్తుంది? దీన్ని ఎలా కొలుస్తారు? ఎంత తీవ్రత ప్రమాదకరం? మయన్మార్, థాయిలాండ్ లో ఇటీవల భారీ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు ఎక్కువగానే జరగడంతో విధ్వంసం జరిగింది. కళ్ల ముందే భారీ భవంతులు, వంతెనలు కుప్పకూలిపోయాయి. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే, ఇటీవల కాలంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో కూడా భారీస్థాయిలో కాకున్నా చిన్నచిన్న భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ లో భూకంపం వచ్చింది. అంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భూమి ఎందుకు కంపిస్తుంది? భూకంప తీవ్రతను ఎలా కొలుస్తారు? భూకంప సమయంలో రక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.