న్యూడిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత, అదాని గ్రూప్ వ్యవహారంపై ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంట్ ఉభయసభలు వాయిదాపడ్డాయి.
న్యూడిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత, అదాని గ్రూప్ వ్యవహారంపై ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంట్ ఉభయసభలు వాయిదాపడ్డాయి. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని తొలగిస్తూ అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలతో పాటు పలు విపక్ష పార్టీల ఎంపీలు కూడా నల్లదుస్తులు ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఇలా బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా నల్ల దుస్తులు, కండువాలు ధరించి పార్లమెంట్ కు హాజరయ్యారు. ఉభయసభలు వాయిదా పడటంలో పార్లమెంట్ ప్రాంగణంలో సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్, విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు.ఈ నిరసనలో కూడా బిఆర్ఎస్ ఎంపీలు కూడా పాల్గొని సోనియా గాంధి ముందు కూర్చుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసారు.