Galam Venkata Rao | Published: Feb 25, 2025, 2:00 PM IST
Mahakumbh 2025: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి.. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వీఐపీలు, సినీ, రాజకీయ ప్రముఖులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. శివరాత్రి పర్వదినం తర్వాత కుంభమేళా ముగియనుండడంతో భక్తులు పోటెత్తారు.