Galam Venkata Rao | Published: Feb 8, 2025, 2:03 PM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా, అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా వెలువడుతున్నాయి. మేజిక్ ఫిగర్ (36 సీట్లు) దాటేసిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. దీంతో ఆప్‌కి ఓటమి తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ గురువు, సామాజిక కార్యకర్త అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ని అధికార దాహమే ఓడిస్తోందన్నారు. కేజ్రీవాల్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడ్డట్లు అనేక ఆరోపణలు వచ్చాయని.. ఢిల్లీ మద్యం కుంభకోణం (లిక్కర్ స్కామ్)తో కేజ్రీవాల్ అప్రతిష్ఠపాలయ్యారని చెప్పారు.