Nov 11, 2021, 4:52 PM IST
అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, స్వాతంత్ర్య భారత మొదటి విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకను అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి రెండూ జరిపాయి. క్యాంప్ కార్యాలయంలో అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజాద్ బాషా, ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమున్నిసా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ పాల్గొన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆ పార్టీ శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు. ఈ కార్యక్రమంలో కొమ్మారెడ్డి పట్టాభిరాం, గురజాల మాల్యాద్రి, సయ్యద్ రఫీ, ఏవ రమణ , కుమార్ స్వామి, దారప నరేంద్ర పాల్గొన్నారు.