పశ్చిమ బెంగాల్ ఘోరం... టీఎంసీ నేత హత్యతో ఉద్రిక్తత... పదిమంది సజీవదహనం

Mar 22, 2022, 3:21 PM IST

రంపుర్హట్: పశ్చిమ బెంగాల్ లో దారుణం చోటుచేసుకుంది. బీర్భూమ్ జిల్లాలోని రంపుర్హట్ పట్టణ సమీపంలోని బోగ్తుయి గ్రామంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామంలో చెలరేగిన అల్లర్లు హింసాత్మక ఘటనలకు దారితీసాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటికి అల్లరిమూకలు నిప్పంటించగా మంటల్లో చిక్కుకుని పదిమంది సజీవదహనం అయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా వున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.