
తెలుగు డబ్బింగ్ మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతూంటుంది. గత చిత్రాల ఫలితాలను బట్టి ఇప్పటి సినిమాల రేట్లు నిర్ణయింపబడుతూంటాయి. అదే విధంగా ఒకప్పుడు ఇక్కడ తెలుగులో వరస హిట్స్ తో ఒక వెలుగు వెలిగిన విక్రమ్ డబ్బింగ్ సినిమా రైట్స్ రేటుని విజయ సేతుపతి దాటేసారు. ఇది ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విక్రమ్ సినిమాలు ఇక్కడ ఆడకపోవటం, విజయ్ సేతుపతి మహారాజా చిత్రం వర్కవుట్ కావటం అందుకు కారణం.
విజయ్ సేతుపతి, వెట్రీమారన్ కలయికలో రూపొందిన ‘విడుదల -1’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘విడుదల-2’. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. ప్రముఖ నిర్మాత, శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. విడుదల 2 చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రైట్స్ ని రూ. 4 కోట్లకు తీసుకున్నారు.
విక్రమ్ తమిళ హీరో అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. విక్రమ్ కు తెలుగులోనూ ఫర్వాలేదనిపించే మార్కెట్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపించే విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రం 'వీర ధీర శూరన్: పార్ట్ 2'. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజైంది.
టీజర్ చూస్తే మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ అని అర్థమవుతోంది. అయితే ఈ సినిమాని తీసుకోవటానికి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ఉత్సాహం చూపించటం లేదు. అది ఎవరూ ఊహించని విషయం. 'వీర ధీర శూరన్: పార్ట్ 2' చిత్రం 2025 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
విజయ్ సేతుపతి తెలుగులో వరస పెట్టి హిట్స్ కొడుతున్నారు. ఆయన గత చిత్రం మహారాజా 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. విక్రమ్ తర్వాత వచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్ ని నమోదు చేసింది. అదే విక్రమ్ ఎప్పుడో శివపుత్రుడు, అపరిచితుడు, స్వామి వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు.
రీసెంట్ గా మణిరత్నం దర్శకత్వంలో వచ్చన పొన్నియన్ సెల్వన్ సీరిస్ కొంత రిలీఫ్ ఇచ్చింది కానీ పెద్దగా ఇపయోగపలేదు. తంగలాన్ తెలుగులో వర్కవుట్ కాలేదు. దాంతో ఆయన తెలుగు బిజినెస్ అంతంత మాత్రంగా మారింది.
విజయ్ సేతుపతి విడుదల 2 విషయానికి వస్తే...ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ తో పాటు పాటల్లో కూడా మంచి టెంపో ఉంది. ఈ చిత్ర కథాంశాన్ని చెప్పాలంటే.. ” పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉధ్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాధే ‘విడుదల-2′.
ఈ చిత్రంలో పెరుమాళ్ పాత్రకు సేతుపతి నూటికి నూరు శాతం సరిపోయాడు. నక్సెలైట్ పాత్రలో విజయ్ సేతుపతి నటన, పాత్రలోని ఎమోషన్ ఆయన పండించిన విధానం అద్భుతం. ఏడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న వెట్రీమారన్ దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోలదరూ ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు.
ఇక ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా ప్రళయం లాంటి సంగీతాన్ని అందించారు. డిసెంబర్ 20న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధిస్తుంది’ అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుడు కొండా విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఈ చిత్రం ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకవెళుతుంది. తప్పుకుండా ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది అన్నారు.