పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని ఉపయోగించి మనం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. పసుపు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు తొందరగా తగ్గేలా చేస్తుంది. ముఖ్యంగా ఇది గాయాలను తొందరగా మాన్పడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
అయితే ఈ రోజుల్లో మోకాళ్ల నొప్పులు చాలా చిన్న వయసు వారికి కూడా వస్తున్నాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నా.. ఈ సమస్య వల్ల నడవడం, కూర్చోవడం, పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అయితే పసుపుతో ఈ మోకాళ్ల నొప్పులను కొంతవరకు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగంటే?
కీళ్ల నొప్పులు
కీళ్ల నొప్పులు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఈ కీళ్ల నొప్పులు ఎముకలు అరగడం, రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం, గాయాలు కావడం వంటి వివిధ కారణాల వల్ల వస్తాయి. ఈ నొప్పులను తగ్గించుకోవడానికి పసుపును ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఆర్థరైటిస్
పసుపు కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పసుపులో పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ల నొప్పులను, మంటను తగ్గించడానికి బాగా సహాయపడతాయి.
యూరిక్ ఆమ్లం
పసుపులో ఎన్నో దివ్య ఔషదగుణాలుంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ,యాంటీబయాటిక్ లక్షణాలు మన శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడతాయి.
గాయాలు
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గాయాల వల్ల అయిన కీళ్ల నొప్పులను తగ్గించడానికి బాగా సహాయపడతాయి.
పసుపు పాలు
పసుపు పాలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందుకోసం ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేయండి. అంతే పసుపు పాలు రెడీ. ఈ పసుపు పాలు తాగితే ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి పసుపును కొబ్బరినూనె లేదా తేనెతో కలిపి పేస్ట్ లా చేయండి.దీన్ని కీళ్లకు అప్లై చేయండి. అలాగే మీ రోజువారీ ఆహారంలో కూడా పసుపును చేర్చండి. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.