Lifestyle

చెస్ ప్రపంచ విజేత గుకేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే

గుకేష్ ప్రయాణం..

7 ఏళ్లకే గుకేష్ డోమ్మరాజు చెస్ ప్రపంచ ఛాంపియన్ కావాలని కల కన్నాడు. 18 ఏళ్లకే ఆ కల నిజమవుతుందని తల్లిదండ్రులు ఊహించలేదు.

డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేష్ చరిత్ర సృష్టించాడు

చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేష్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. గుకేష్ జీవితం, చదువు గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.

గుకేష్ కోసం ఉద్యోగం వదిలేసిన తండ్రి

గుకేష్ టోర్నమెంట్ల కోసం తండ్రి రాజినికాంత్ ఈఎన్‌టి సర్జన్ ఉద్యోగాన్ని వదులుకున్నారు.

కుటుంబ బాధ్యతలు తల్లి పద్మ మోశారు

గుకేష్ తల్లి పద్మ కుమారి కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకున్నారు.

గుకేష్ ప్రయాణంలో ఆర్థిక ఇబ్బందులు

2017-18లో గుకేష్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. స్నేహితుల సహాయంతో టోర్నమెంట్లకు వెళ్లేవారు.

గుకేష్ చెస్ కెరీర్ ప్రారంభం

2013లో గుకేష్ చెస్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. 2017లో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ గెలిచాడు.

గుకేష్ చదువు

చెస్ పై ఉన్న మక్కువ చూసి, గుకేష్ తల్లిదండ్రులు నాల్గవ తరగతి తర్వాత స్కూల్ మాన్పించారు.

గుకేష్ ఎదుర్కొన్న కష్టాలు

స్పాన్సర్లు లేకుండా గుకేష్ చాలా టోర్నమెంట్స్ ఆడాడు. 2019లో అతి చిన్న వయసు గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు.

విశ్వనాథన్ ఆనంద్ అకాడమీలో శిక్షణ

విశ్వనాథన్ ఆనంద్ గైడెన్స్ గుకేష్ కు కీలకం. 2020లో కోవిడ్ సమయంలో ఆనంద్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు.

గుకేష్ చెస్ ప్రపంచ ఛాంపియన్ కల నెరవేరింది

2024లో డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేష్ తన కలను నెరవేర్చుకున్నాడు. తల్లిదండ్రుల త్యాగం, కృషి ఫలితమిది.

5 నిమిషాల్లో వేసుకోగల కీర్తీ సురేష్ సింపుల్ హెయిర్ స్టైల్స్

సెలబ్రిటీలు నెయ్యి ఎందుకు తింటారో తెలుసా

కీర్తి సురేష్ అదిరిపోయే చీరల కలెక్షన్

ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగితే ఏమౌతుందో తెలుసా